గోపీప్రేమ

బృందావనకృష్ణుడలా కాదు. ఆయన తనలోని ఈ సామాన్య జనపక్షపాతాన్ని వీలైనంత ప్రకటించుకుంటాడు. వివిధ ఆశ్రమాలుగా, వర్ణాలుగా, అంతస్తులుగా, తరతమభేదాలతో చీలి ఉన్న సమాజంలో ముక్తికి అందరికన్నా ఎక్కువ సన్నిహితులు బృందావన గోపికలేనని ఆయన చెప్పడంలోని పరమపురుష తత్త్వాన్ని మనం చూడాలి