బరంపురంలో

లక్ష్మణరావుగారు రచయిత, అనువాదకుడు, ఆత్మచరిత్రకారుడు నిజమే కాని,అన్నిటికన్నా ముందు మహామానవుడు. శతాబ్దమంత సుదీర్ఘం, సుసంపన్నం అయిన జీవితం ఆయనది. జగదీశ్ చంద్ర బోస్ దగ్గర వృక్ష శాస్త్ర పరిశోధన చేసినవాడు, మహాత్మాగాంధీ చెంతన సబర్మతిలో ఆశ్రమవాసం చేసినవాడు