నా కాశీయాత్ర-1

కాశీ సూక్ష్మరూప భారతదేశం. ఈ దేశంలో ఎన్ని వైరుధ్యాలున్నాయో అన్నీ అక్కడ కనిపిస్తాయి. అక్కడ శౌచం గురించిన ఆరాటం ఎంత ఉందో అంత అశౌచం ఉంది, జీవితం అక్కడ ఎంత ఉరుకులు పరుగులు పెడుతుందో, అంత తీరికదనముంది. మరింత బాగా బతకాలని మనుషులు అక్కడ ఎన్ని మొక్కులు మొక్కుకుంటారో, అక్కడ చనిపోవాలని కూడా అంతగా కోరుకుంటారు.