ఆ మాట వినగానే నా మనోబుద్ధ్యాత్మలన్నీ ద్రవీభూతమైపోయాయి. ఈ ప్రపంచంలో ఇప్పుడిట్లాంటి ఆహ్వానం ఎక్కడ లభిస్తుంది? జీవించిఉండిఉంటే, మా అమ్మ నుంచి వినవచ్చే పిలుపు. 'ముందు అన్నం తినండి, తర్వాత మాట్లాడుకుందాం' అనే మాట మా నాన్నగారి మాట. నాకు గుండెలో కన్నీళ్ళు ఉబికాయి.
నా కాశీయాత్ర-3
ఆ నదుల కలయికని ఇప్పుడంటే నా కళ్ళముందు చూస్తున్నాను గాని, అసలు ఈ దేశంలో ప్రతి ఒక్క భావుకుడూ ఒక త్రివేణీ సంగమమే కదా. తిరిగి వారణాసికి ప్రయాణిస్తున్నంతసేపూ భారతీయ సాహిత్యంలో ఆ నదీప్రశంసలే నా మనసులో మెదుల్తూ ఉన్నాయి. ఆకాశంలో చంద్రుడు కూడా అలహాబాదునుంచి వారణాసిదాకా మాతో పాటే ప్రయాణిస్తూ ఉన్నాడు
నా కాశీయాత్ర-2
మంగళవాద్యాల, శంఖతాళాల మధ్య బిగ్గరగా పాడుతున్న హారతిగీతాల మధ్య దేదీప్యమానమైన దీపాల వెలుగు, రంగురంగుల దీపాలు, ఆ దీపకాంతిలో లక్షలాది రంగుల్లో యాత్రీకులు, వారి వదనాలన్నీ నీటిమీద కలిసిపోతున్న నీటిరంగుల్లాగా అలుక్కుపోయి ఆ ఒడ్డంతా ఒక ఇంద్రచాపం పరిచినట్టుగా అనిపించింది.