కస్తూరి పరిమళం

కొందరు మనల్ని పలకరించినప్పుడు కస్తూరి పరిమళం గుప్పుమంటుంది. మరికొందరు పలకరిస్తే పొగ కమ్ముకుంటుంది' అని రాసాడట రూమీ. మూడేళ్ళ కిందట నా చేతుల్లోకి వచ్చినట్టే వచ్చి చేజారిపోయిన పుస్తకం అన్నెమేరీ షిమ్మెల్ రచన Rumi (ఆక్స్ ఫర్డ్, 2014) ఈ సారి పుస్తక ప్రదర్శనలో చేతికందింది.