ఆత్మకథనాత్మకం

అంటే ఏమిటి? ఒక కళాకారుడు తన ఎదట ఉన్న ప్రపంచాన్ని తన కళతో తన కృతిగా మార్చేస్తాడు. నువ్వొక సంగీత కారుడివనుకో, నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నువ్వొక రాగాలాపనగా మార్చేస్తావన్నమాట. సరిగ్గా కురొసావా చేయడానికి ప్రయత్నించిందీ అదే.

పార్థివత్వం, అపార్థివత్వం

అంతిమంగా ఏ కళాకారుడైనా రాయవలసిందీ, చిత్రించవలసిందీ, మతానికీ, ప్రాంతానికీ, భాషలకీ, సరిహద్దులకీ అతీతంగా మనిషికీ, మనిషికీ మధ్య వికసించవలసిన స్నేహమే అని తెలియడం అది. ఒక నరుడికీ, ఒక వానరుడికీ మధ్య తటస్థించిన స్నేహాన్ని ఆదికవి ఎందుకంత ఐతిహాసికంగా గానం చేసాడో మనకి బోధపడక తప్పని సమయమది.