ఇంట్లో ఎవ్వరూ లేరు. మా ఇంటి గుమ్మం దగ్గర నిలుచుని ఆమెజాన్ వార్తాహరుడు పోన్ చేస్తున్నాడు. నేనింకా ఆఫీసులోనే ఉండిపోయాను. అతడి దగ్గర చార్లెట్ వాడవిల్లి A Weaver Named Kabir ఉంది. నేను అందుకోకపోతే వెళ్ళిపోతాడు. సంకేతస్థలానికి స్నేహితురాలు వచ్చేసినా కూడా ఇంకా ఆఫీసులోనే ఉండిపోయినవాడిలా ఉంది నా పరిస్థితి.