సుమారు 600 గీతాలకు, అతడు సంగీత స్వరకల్పన చేసాడు. సాహిత్యానికీ, సంగీతానికీ మధ్య అంత విస్తారమైన సమన్వయానికి కృషి చేసిన మరొక కంపోజర్ మనకి పాశ్చాత్య సంగీతంలో కనబడడు.
బాలమురళి
ఎప్పటి దృశ్యమో గుర్తు లేదు, బాలమురళి పాడుతున్నాడు: 'కొమ్మకొమ్మకు ఒకటి తుమ్మెద ఎంగిలంటున్నాయి లింగా '.
బాలాంత్రపు రజనీకాంతరావు
నిన్నసాయంకాలం గుంటూరులో వైశ్య హాస్టల్లో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ తరఫున బాలాంత్రపు రజనీకాంతరావుగారికి విశిష్ట సేవా పురస్కారం అందించారు. ఆ సత్కార సభలో రజనీకాంతరావుగారితో వేదిక పంచుకోవడమే కాక, ఆయన గురించి మాట్లాడే అవకాశం కూడా నాకు కలిగింది. మరీ ముఖ్యంగా శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ వారు రజనీకాంతరావుగారిమీద ప్రచురించిన విశేష సంచిక 'రజని ' నీ అవిష్కరించే అదృష్టం కూడ కలిగింది.
