కవిత్వం కూడా యవ్వనంలాగా, వసంతంలాగా, ఒక జీవితంలో ఒక్కసారి మటుకే వచ్చివాలుతుంది. నిర్మలమైన ప్రేమలాగా, యవ్వనారంభసమయంలోనే సాక్షాత్కరిస్తుంది. కవి అంటే పాతికేళ్ళలోపు, మహా అయితే, ముప్పై ఏళ్ళ లోపు కవిత్వం చెప్పినవాడే, కీట్స్ లాగా, రేంబో లాగా, తోరూదత్ లాగా, మహా ప్రస్థానగీతాలు రాసిన శ్రీ శ్రీ లాగా. ఆ తర్వాత కూడా కవిత్వం రాయొచ్చుగాని, అప్పుడది అయితే వచనమవుతుంది, లేదా ప్రవచనమవుతుంది.
లాంగ్ స్టన్ హ్యూస్
చాలా ఏళ్ళకిందటి మాట. 1990 లో. అప్పుడు నేను కర్నూల్లో జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా చేరాను. అప్పటికే మా కలెక్టరు నా కోసం ఎదురుచూస్తున్నాడు. అక్కడ నల్లమల అడవుల్లో ఇంకా వేట, ఆహారసేకరణ మీద జీవిస్తున్న చెంచువారిని వ్యవసాయం లోకి తేవడం నా బాధ్యత అని చెప్పాడు.
నా ప్రభువుని సిలువవేసినప్పుడు
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1959 లో భారతదేశంలో పర్యటించినప్పుడు వినోబా భావేని కూడా కలుసుకున్నప్పటి ఒక అపురూపమైన సంఘటనని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ రాసిపెట్టుకున్నారు. డా.కింగ్ తన సతీమణితో వినోబాని చూడటానికి వెళ్ళినప్పుడు కొంతసేపు సంభాషణ సాగాక వారితో పాటు ఉన్న ఒక మతాచార్యుడు కొన్ని ఆఫ్రికన్ అమెరికన్ ఆధ్యాత్మికగీతాలు ఆలపించవలసిందిగా డా.కింగ్ సతీమణిని కోరాడు.
