పక్షిభాషాకోవిదుడు

ఇప్పుడతడు పక్షి భాషలు నేర్చుకోడం మొదలుపెట్టాడు. ఈ నాలుగేళ్ళల్లోనూ వాటితో నిశ్శబ్దంగా సంభాషించే స్థాయికి చేరుకున్నాడు. వాటికీ తనకీ మధ్య జరిగే ఆ సంభాషణల్ని మనకి అందిస్తున్నాడు. అవి గొప్ప చిత్రలేఖనాలు, బషొ, ఎమిలి డికిన్ సన్, బ్లేక్, హేరీ మార్టిన్ సన్, ఇస్మాయిల్ కవితల్లాగా అవి గొప్ప మెడిటేషన్స్.

ఋషి తుల్యురాలు

ఈమె మన కాలం నాటి మనిషేనా? ప్రాచీన చీనా కవి హాన్ షాన్, జపనీయ జెన్ సాధువు ర్యోకాన్, తంకా కవి సైగ్యొ, హైకూ కవి బషొ, గాంధీని గాఢాతిగాఢంగా ప్రభావితం చేసిన టాల్ స్టాయి, థోరో, రస్కిన్ ల వారసురాలు, ఋషి తుల్యురాలు, ఈమె నిజంగా మన కాలంలోనే మన మధ్యనే జీవిస్తున్నదా? 

సాంస్కృతిక రాయబారి

ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యాల పట్ల ఆమె అధికారం మనల్ని నివ్వెరపరుస్తుంది. ఆమె మనోవేగంతో సాహిత్యప్రశంస చెయ్యగలరు. ఏ సాహిత్య విశ్లేషణలోనైనా మనం చివరి మాట చెప్పాం అనుకున్నప్పుడు, ఆ తర్వాత మాట ఆమెదే అవుతుంది.