భూషణంగారు రాసిన ఈ 'రుణం' కథ మళ్ళా చదవడంతో. ఇది కథనా? కాదు, chronicle. అత్యంత సత్యసంధుడైన ఒక మానవుడు అక్షరబద్ధం చేసిన ఒక ఆత్మచరిత్రశకలం. పోరాటాలు చేసేవాళ్ళూ, విప్లవాలు కోరుకునేవాళ్ళూ, ప్రజల మేలుకోరేవాళ్ళూ ఎలా ఆలోచిస్తారో, ఎలా నడుస్తారో, ఎలా జీవిస్తారో, ఈ కథలో ప్రతి అక్షరం ఒక నిరూపణ.
సాహిత్యవేత్త
శ్రీ సూరపరాజు రాధాకృష్ణమూర్తికి మనం సమకాలికులం కావడం మన అదృష్టమని భావిస్తాను. నేను ఎటువంటి సాహిత్యవేత్తకోసం అన్వేషిస్తుంటానో, అటువంటి సాహిత్యసహృదయుడు ఆయన.
సాహిత్యసేవకుడు
కృష్ణారావుగారు ఒక సామాజిక చరిత్రసంపుటి, సాహిత్యచరిత్రసంపుటి, కానీ, తానో మరొకడో ఎవరో ఒకరు మటుకే జీవించవలసివస్తే తన తోటిమనిషికి జీవితావకాశాల్ని అందించి తాను వెనకవరసలో నిలబడిపోగలిగిన వ్యక్తి.
