ఆఫ్రికా కవిత

ఆధునిక ఆఫ్రికన్ సాహిత్యం ప్రధానంగా సామాజిక-రాజకీయ అసమ్మతి సాహిత్యం, నిరసన సాహిత్యం, కోపోద్రిక్త సాహిత్యం. తన పురాతన ఆఫ్రికన్ గతానికీ, దారుణమైన వర్తమానానికీ మధ్య ఆధునికమానవుడు పడిన సంక్షోభానికి, సంఘర్షణకి వ్యక్తీకరణ ఇది. తనెవరో, తన అస్తిత్వం ఏమిటో వెతుక్కుంటూ, గుర్తుపట్టుకుంటూ చేసిన ప్రయాణం అది.

కథల పుట్టిల్లు

ఆఫ్రికన్ సామెతలు, జానపద కథలు, చిక్కు ముళ్ళు వింటే కథలు వాటికవే సందేశం అని తెలుస్తుంది. కేవలం కథనానందం ఎలా ఉంటుందో తెలియాలంటే ఆఫ్రికన్ జానపద కథలు వినాలి. అచ్చమైన కథన కుతూహలం ఆఫ్రికాజాతులకి తెలిసినట్టుగా మరెవరికీ తెలియదనాలి.

గూగి వా థియోంగో

గూగి వా థియోంగో (1938) కెన్యాకి చెందిన రచయిత. సమకాలిక ఆఫ్రికన్ రచయితల్లో అగ్రశ్రేణికి చెందినవాడు. కథ,నవల, నాటకం వంటి ప్రధాన ప్రక్రియల్లో చెప్పుకోదగ్గ రచనలు వెలువరించాడు. ముఖ్యంగా ఆఫ్రికన్ తెగల్లో ఒకటైన గికుయు తెగ వారి భాషలో ప్రస్తుతం రచనలు చేస్తున్నాడు.