
ఎవరో ఒకరు ఏదో ఒక కాలంలో మనని తలుచుకుంటూ మన కవిత్వం చదువుకుంటారని ప్రాచీన గ్రీకు కవయిత్రి శాఫో అన్నమాటలు సుప్రసిద్ధాలు. సంస్కృత మహాకవి భవభూతి కూడా ఇటువంటి మాటలే చెప్పాడు: ఇప్పుడిక్కడ మమ్మల్ని పట్టించుకోనివాళ్ళ కోసం కాదు, మేం రాస్తున్నది. మాతో సమానధర్మం కలవారెవరో రేపు రానున్నారు. కాలం అనంతం, పృథ్వి విశాలం అని. ప్రపంచ వ్యాప్తంగా, ఎన్నో యుగాలుగా కవిత్వం చెప్తూ వస్తున్న కవులంతా అటువంటి సహృదయ పాఠకుడికోసమే ఎదురుచూస్తూ ఉన్నారు.
మనం అటువంటి పాఠకులం కావాలన్నదే నా జీవితకాల సాధన. అందులో భాగంగా, గతంలో ప్రపంచ కవిత్వం పైన నా స్పందనల్ని ‘ఎల్లలోకము ఒక్క ఇల్లై’ (2002) పేరిట మీతో పంచుకున్నాను. ఆ తర్వాత ఈ మూడేళ్ళుగా చదువుతూవస్తున్న కవిత్వం గురించి రాసిన 37 వ్యాసాల్ని ఇలా మీతో పంచుకుంటున్నాను. ‘ఎవరో ఒకరు ఏదో ఒక కాలంలో’ అనే ఈ పుస్తకాన్ని ఇక్కడ డౌనులోడు చేసుకోవచ్చు.
నాకు తెలిసి కొర్రపాటి ఆదిత్య అటువంటి ఒక పాఠకుడు. ఈ పదిపదిహేనేళ్ళుగా నేనతణ్ణుంచి ఎంతో తెలుసుకున్నాను. అతడు నాకోసం కేటాయించిన తన అమూల్య సమయానికి ప్రతిఫలంగా నేనేమీ అతడికి ఇవ్వలేకపోయాను. అందుకని, ఇప్పుడు, ఈ పుస్తకం, అతడి చేతుల్లో పెడుతున్నాను.
ఇది నా 72 వ పుస్తకం.
16-10-2025


శుభాకాంక్షలు ఆదిత్య గారూ 💐
కృతజ్ఞతలు గురువుగారు ✨💐🙏
హృదయపూర్వక ధన్యవాదాలు సోమ భూపాల్!
కన్య స్వాములకు కొరత లేని శబరిమలై..నా కుటీరం.. 🙏
శుభోదయం సర్, ధన్యవాదాలు సర్
ధన్యవాదాలు మేడం
good jesture for aditya kudos to sir
ధన్యవాదాలు సార్