
నడివేసవి వెన్నెల రాత్రి.
హటాత్తుగా పెద్దవర్షం.
కరెంటుపోయింది. నగరానికి
అడవి దగ్గరగా జరిగేదిలాంటప్పుడే.
ఎవరూ గుర్తుపట్టకుండానే ఆ చీకట్లో
పెద్ద ఊరేగింపు వెళ్ళిపోయిన నిశ్శబ్దం.
కిటికీ తెరలు పక్కకి తప్పించి చూస్తే
ఇంకా పూర్తిగా పిండకుండానే ఆరేసినవెలుగు.
కిటికీ లోంచి వీస్తున్న గాలిలో
నా చిన్నప్పటి పాలపూల పరిమళం
దాని వెన్నంటే ఒక చిమ్మెట
వెలుతురు కూనిరాగం.
అయితే పట్టపగలు, లేదా విద్యుద్దీపాల మధ్య
ఎన్నిసార్లు ఎన్నిచోట్ల ఎందరితో
ఈ నగరంలో నేను తిరుగాడలేదు!
అయినా ఎందుకో ఈ ఊరు నాకు అంతుబట్టదు.
ఆ రాత్రి మసకవెన్నెల కిటికీలోంచి
కనబడుతున్నది మటుకు బాగా తెలిసినట్టుంది.
అది ఈ నగరం పుట్టకముందు నగరమని
పోల్చుకోడం నాకేమంత కష్టం కాలేదు.
Featured image and painting above by James Whistler (1834-1903)
19-5-2025


నగరం పుట్టకముందు ఆధునిక కవచాలు లేని నిసర్గ నగరం అర్ధరాత్రి కరెంటుపోయిన వేళలో
అడవికి దగ్గరగా ఎంత కవితాత్మక కల్పన
ధన్యవాదాలు సార్
నగరం పుట్టక ముందు నగరం…..wah! ❤️❤️
ధన్యవాదాలు మానసా!
Sir, every thought and image in your writing is so beautifully expressed.
The way you bring to life a city that existed even before it began feels almost unreal, but strangely familiar and deeply nostalgic.
మా ఊళ్ళో వాన కురిసి వెలిసిన రాత్రి గుర్తొచ్చింది. Thank you 🙏🏽
Beautiful expression! Thank you so much!🙏