సత్యాన్వేషణ

ఆ క్రమంలో పాశ్చాత్య తత్త్వశాస్త్రం నుంచి కొన్ని రచనల్ని 'సత్యాన్వేషణ' పేరిట, భారతీయ దర్శనాల నుండి కొన్ని రచనల్ని 'ఆత్మాన్వేషణ' పేరిట తెలుగులోకి తేవాలని అనుకున్నాం. అలా వెలువడిన ప్రయత్నమే ఈ 'సత్యాన్వేషణ'.

సాహిత్యపోషకులు

ఇటువంటి వాళ్ళనే మా మాష్టారు సాహిత్యపోషకులు అనేవారు. అంతేతప్ప కవిగారికి నెలతిరగ్గానే ఒక బియ్యం బస్తా ఇంటికి పంపించేవాళ్ళు కాదు అని కూడా అనేవారు ఆయన.

భవభయదారుణం

బయటి ప్రపంచానికి అంతగా తెలియని ఒక మిత్రుడి కథ రాస్తున్నట్టుగా నిరాలా నిజానికి తన గురించి మనకు తెలియని ఒక మహోన్నత ముఖచిత్రాన్ని పరిచయం చేసాడు. ఈ చిన్నపుస్తకం అవశ్యం తెలుగులోకి రావలసిన పుస్తకం. ఇంగ్లిషునుంచి కాదు, నేరుగా హిందీనుంచే అనువాదం చెయ్యగలిగినవాళ్ళు ముందు కొస్తే నేను మరింత సంతోషిస్తాను.