కవీ, కోకిలా, లోకమూ

కవి కూడా న్యూసుపేపరు చదువుతాడు
సోషలుమీడియా పోస్టులు ఫాలో అవుతాడు
అయినా అతనికెప్పటికీ ఆ భాషపట్టుబడదు
ఎన్నేళ్ళైనా పరాయిభాషగానే మిగిలిపోతుంది.

ఎప్పటికన్నా తమకి పనికొచ్చేలా రాస్తాడా
మహాశయుడని ఎదురుచూస్తుంటుంది లోకం
తననెవరు పలకరించినా, పాపం, వాళ్ళకి
తన అక్షరాలు నేర్పాలని చూస్తుంటాడు కవి.

ఇంతలో కాలనీలో అడుగుపెడుతుంది కోకిల.
రాలిపడ్డ పూలరేకలు కూడా ఆమె గొంతు
వింటూనే పురాతనభాషలో బదులిస్తాయి.
ఇక లోకం కేసి చూడమన్నా చూడడు కవి.

31-3-2026

4 Replies to “కవీ, కోకిలా, లోకమూ”

  1. “చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ.. అన్నట్టు.. బ్రతుకు మర్మం తెలిసిన కవికి.. బ్రతక నేర్చిన భాష పట్టుబడదేమో ..

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%