
నానాటికీ మనం ప్రతిఒక్కరం పరస్పరం,
దట్టమైన వలలో పోగుల్లాగా, దగ్గరవుతున్నాం.
ఇప్పుడిక్కడ ఏ ఒక్కరు గాయపడ్డా, ఆ నొప్పి,
క్షణాల్లో, మొత్తం ప్రపంచానికి పాకుతుంది.
చూడ్డానికిదంతా గొప్పగానే కనిపిస్తుందిగానీ,
ఇది వట్టి వినియోగదారుల అనుబంధం.
తూకం ఎక్కడ తేడా వచ్చినా అక్కడికక్కడే
ఆగిపోయే క్రయవిక్రయాల వ్యవహారం.
సంతోషాన్ని ధారాళంగా వెదజల్లే లోకంలో
లెక్కలు వేరేలా ఉంటాయి. చిగురిస్తున్న చెట్లు
కురిపిస్తున్న కాంతి ఏ ఒక్కరు మూటగట్టుకున్నా,
ఆ లబ్ధిలో, మొత్తమందరికీ వాటా దక్కుతుంది.
27-3-2026


చిగురిస్తున్న చెట్లకురిపిస్తున్న కాంతి తమరు. గాయపడ్డ నాకు మీ భావాలే నాకు ఉపశమనం. సర్. మీకు నా ధన్యవాదాలు
వలలో దారప్పోగులు
ఇలలోన జనాలను పరికింపంగా , ఆ
వల , తూకపు తేడాల్ , తరు
వుల చిగురుల కాంతి , తమరి ఊహలు ఘనముల్ .
ధన్యవాదాలు సార్!
One of your best poems and reflects your spirit so very well. ఇది చదవకముందే నా పుట్టినరోజు విషెస్ రాసుకున్నాను.
మీ కవిత్వంలో నేను చూసేది ఈ లెక్కలు లేని ప్రపంచాన్నేనని.. సంతోషంగా, గర్వంగా ఉంది సర్. మీ కవిత్వం నాకుందరిగానే అర్థమైందన్న నమ్మకం కలిగి.
హృదయపూర్వక ధన్యవాదాలు మానసా!
నాకు సరిగానే**
(ఎడిట్ చేశాక కూడా తప్పు పబ్లిష్ అయింది 😭)