ఫాల్గుణమాసంలో రంజాన్

తెల్లవారుతూనే ఈ చెట్టు రోడ్డుమీదకీ
వలపన్ని కూచుంటుంది. చాలాకాలం
పాటు వెతుక్కునేవాణ్ణిందులో, కొండలూ
కోనలూ, నా చిన్నప్పటివి, చిక్కుతాయని.

ఇప్పుడు నా దృష్టి గతాగతాలమీద లేదు.
పరికిస్తున్నాను ఆ ఆకుపచ్చని వలని,
దాని కంతల్లోంచి కారిపోతున్న వెలుగుని,
దానిలోపల చిక్కబడుతున్న దగ్గరితనాన్ని.

రోజంతా ఆకాశం మీద వలలు విసిరాక
సాయంకాలానికి ఈ ఋతువు పోగేసుకునేది
ఉపవాసదీక్ష ముగించేవేళల నిశ్శబ్దం.
దానికి నిన్నటి చింత లేదు, రేపటి ధ్యాసలేదు.


Iftar photography: Samacharam Ravi

13-3-2026

3 Replies to “ఫాల్గుణమాసంలో రంజాన్”

  1. ఇక్కడ ఫాల్గుణం కనిపించటం లేదు
    రంజాన్ కూడా కనుపించటం లేదు
    వలలైతే అన్ని చరణాలనూ స్పృశిస్తున్నాయి
    అన్నట్లు ఆవలలు భూమ్యాకాశాలను కప్పేసాయి
    ఇక్కడి కవిత్వం గురించి ఏంచెప్పేదీ
    అది ఆవలల్లో చిక్కుకుం దనాలా
    లేదా చెట్టెక్కిం దనాలా
    కాక ఉపవాసకృశశరీరి యైన దనాలా
    తెలియదు
    అది ఈవచనానికి ఆవల కూర్చుం దనాలా
    అదీ తెలియదు
    ఏమో
    తెలియకరాక పోవటమే ఆధునికకవిత్వం కావచ్చు
    ఇంకా ఏమన్నా కావచ్చును
    నాకు తెలియదు
    నేను కవిని కాను కదా

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading