
గాలి పీలుస్తూ బతుకుతూనే నువ్వొక
నాటికి కాంతిపీల్చుకుంటే తప్ప
బతకలేని స్థితికి చేరతావు. అప్పుడు
నీకు వెలుగుతప్ప మరేదీ రుచించదు.
చెట్లు చూడు: మొదట్లో నీళ్ళ కోసం
లోపలకీ ప్రయాణిస్తాయి. తమలోకి
కుదురుకున్నాక, వెయ్యి చేతులు చాచి
వెలుగు పీల్చుకోడం మొదలుపెడతాయి.
అలా నీ రక్తనాళాల్లో వెలుగు ప్రవహించడం
మొదలవగానే అన్నిటికన్నా ముందు నీ
కలలు తేటపడతాయి. అప్పుడు పొద్దున్నే
పక్కమీంచి లేవడమే పద్మంగా మేల్కొంటావు.
9-2-2026
అహా
ధన్యవాదాలు మేడం
My goodness! Beautiful ❤️
ధన్యవాదాలు మానసా!
పద్మంలా మేల్కోవడం … 🪷
Very nice Sir
ధన్యవాదాలు
wow.. పద్మంగా మేల్కొంటావు
ధన్యవాదాలు
Good one sir. ‘ వెలుగుతప్ప మరేదీ రుచించదు. ‘ conveys a deep meaning.