ఒకసారి సీతానగరం సత్యాగ్రహ ఆశ్రమానికి వెళ్తూ గాంధీజీ రాజమండ్రిలో భగీరధిగారి చిత్రలేఖనప్రదర్శన ప్రారంభించారని తెలియడమే ఒక సంతోషం. అటువంటిది ఆయన భగీరధి గీసిన ఒక లాండ్స్కేప్ చూసి, ఆ చిత్రంలో కనిపిస్తున్న మంచుకి, తనకి చలి పుడుతున్నదని చెప్పారంటే, అంత సత్యసంధుడి నోటివెంట అంత ప్రశంస వెలువడిందంటేనే ఆ చిత్రకారుడి కౌశల్యమెటువంటిదో మనం ఊహించవచ్చు.
గాలినాసరరెడ్డికి లేఖలు
అందుకనే అనిల్ బత్తుల సంకలనం చేసిన 'గాలినాసరరెడ్డికి లేఖలు, 1982-2012' (బోధి ఫౌండేషన్, 2025) నా చేతికి అందగానే మొత్తం 86 ఉత్తరాలూ ఏకబిగిని చదివేసాను. ఇంతకీ ఇవి నాసరరెడ్డి రాసిన లేఖలు కావు, నాసరరెడ్డికి కవిమిత్రులు రాసినవి. అంటే కవిని నేరుగా చూడకుండా అద్దంలో చూసినట్టుగా అన్నమాట.
నడుస్తున్న కాలం-4
ఈ మధ్య తెలంగాణా సారస్వత పరిషత్తువారు బాలసాహిత్యం మీద రెండు రోజుల కార్యశిబిరాన్ని ఏర్పాటుచేసారు. బాల రచయితల్నీ, బాలసాహిత్య రచయితల్నీ ఒక్కచోట చేర్చిన ఆ గోష్ఠిలో పిల్లల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే అంశాల గురించి నన్ను కూడా ప్రసంగించమని అడిగారు.
