
పుస్తక పరిచయం ప్రసంగ పరంపరలో భాగంగా ఈ రోజు అవధూత గీత పైన ప్రసంగించాను. దత్తాత్రేయులు రాసారని భావించే ఈ గీత, భారతీయ తాత్త్విక సాహిత్యంలో, అత్యుత్తమ కృతుల్లో ఒకటి. స్థితప్రజ్ఞుడు ఏం మాట్లాడతాడు, ఎలా ఆలోచిస్తాడు, దేని వల్ల నిలబడగలుగుతాడు అన్నదానికి భగవద్గీత ఒక వివరణ అయితే, విముక్తమానవుడు ఎలా ఉంటాడు, ఎలా భావిస్తాడు, ఎలా మాట్లాడతాడు అన్నదానికి అవధూత గీత ఒక నిరూపణ. ఈ పుస్తకం మీద నా ప్రసంగం ఇక్కడ వినవచ్చు.
ఈ గీతాన్ని రెండేళ్ళ కింద అనువదించి, కిందటి ఏడాది, సాఫ్ట్ కాపీగా నా బ్లాగులో విడుదలచేసాను. కిందటి ఏడాది డిసెంబరులో శ్రీపాద లిటరరీ వర్క్స్ వారు పుస్తకంగా ప్రచురించారు. సాప్ట్ కాపీ ఉచితంగా ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చును.
పుస్తకం కావాలంటే 9063992633 ని సంప్రదించవచ్చును.
30-1-2026
Sir, got my copy of this book. Thank you.
This talk is fantastic introduction not only to the Avadhoota Gita, but also to its larger spiritual and historical context.
As you explained, syncretic thought or the మధువిద్య most importantly needs to be understood and practiced in the present day, more than ever.
బహుళ అభిప్రాయాలు వుండడం ఆ జాతి మానసిక చింతన ఆరోగ్యానికి చిహ్నం!
“బహుళ అభిప్రాయాల నుండి బహుళ సిద్ధాంతాల నుండి బహుళ దర్శనాల నుండి మంచి విషయాలను తెలుసుకుని దానితో జీవన విధానాన్ని సంపన్నం చేసుకోవడం మధువిద్య, నిజమైన సత్యాన్వేషకుని లక్షణం కాడా”
How Dattatreya became a syncretic presence, and how multiple religions and traditions came to own him for what he stood for.
“వొళ్ళంతా వెలుగు పూసుకున్నవాడు – అవధూత”
“ప్రపంచం మధ్యలో ఉండి కూడా సమస్త దోషాలను దాటినవాడు.
కౌపీనము ధరించి భిక్ష పాత్ర చేతపట్టినా కూడా దీనత్వం అంటని వాడు – అవధూత”
“Song of a free man “
So many profound thoughts were discussed in this talk. Thank you, sir. 🙏🏽
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!