కానీ చాలా జీవితాలు పతాకకి చేరుకోకుండానే ముగిసిపోతాయి. మనుషులు మరణించేది, గొప్ప ఉద్రేకావస్థలో తీవ్ర స్థితికి చేరుకున్నాక కాదు, చాలా సార్లు, ఒక ఉత్తరం రాయడం మర్చిపోయి మరణిస్తారు. ఆర్కిటెక్చరంటూ ఏదీ లేదు. ఉన్నదంతా ఒక చిత్తుప్రతి, ఎన్నిసార్లు మూసినా సరిగ్గా మూసుకోని తలుపు.
అదెలా సాధ్యపడుతుంది?
ఆశ్చర్యం! నాకు ఆ సంఘటన ఏమీ గుర్తులేదు. అతడు ఆ సంగతి చెప్తున్నంతసేపూ నా జ్ఞాపకాల్ని తవ్వుకుని చూస్తూనే ఉన్నానుగానీ, చిన్నపాటి ఆనవాలు కూడా కనిపించలేదు. బహుశా అతడు పొరపడ్డాడేమో అనుకుందామనుకుంటే, అతడి జ్ఞాపకాలైతే చాలా స్పష్టంగా ఉన్నాయి.
ఋషి వాక్యానికి వందనం
గౌరునాయుడు ఒక శక్తిమంతుడైన రచయితగా ఎదగడం, చూస్తూనే ఉన్నాను. ఆయన పాటలు, కవితలు, కథలు, వ్యాసాలు- ఈ రోజు కళింగాంధ్రకి ప్రాతినిధ్యం వహిస్తున్న unacknowledged legislators లో ఆయన కూడా ఒకడు.
