
పొద్దున్నే వేసవివాన వచ్చివెళ్ళాక
వీథులొకపట్టాన మామూలు కాలేవు.
ప్రతి చెట్టుగుబురులోనూ
తేమగా ఒక నిశ్శబ్దం.
కొందరుంటారు- ఇలా వచ్చి
అలా వెళ్ళిపోతారు
వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ
మనలోంచి కొంత పట్టుకుపోతారు.
లేదా ఒక్కొక్కప్పుడు కొంత
ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు.
వేసవివాన వచ్చివెళ్ళిపోయాక
కోకిల కూడా మూగదైపోతుంది.
ఇప్పుడు అదీనేనూ వెతుక్కుంటున్నాం
వదిలిపెట్టిందేదో, వెంట తీసుకుపోయిందేదో.
15-5-2025


కోకిల మూగదై పోవడం వేసవి వాన తరువాత బాధాకరమే .పోయమ్ బాగుంది సర్
ధన్యవాదాలు సార్!
ఈ కోకిల! ఉన్నా లేకపోయినా…దాని సందడి తగ్గట్లేదు.
Beautiful, sir ❤️
Thank you!
మా బెజవాడలో కూడా ఈ పొద్దున్నే అట్లా జోరువానవెలిసిందా.. కప్పల సందడితో తెల్లవారింది..
కోకిలకాలం ముగుస్తుందనే చింత మీరన్నట్లే..
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
Beautiful, sir! 🙏🏽
మనలోని నిశ్శబ్దాన్ని వెంట తీసుకుపోయి
మళ్ళీ వసంతకాలం వరకూ మనలో ఒక ఆశని వదలి వెళ్తుందేమో!!
ధన్యవాదాలు మాధవీ!
Ohh… వేసవి రాత్రి వాన ఒక అందమైన కవితను కూడా వదిలి వెళ్లింది
ధన్యవాదాలు విజయ్!
Ohh… వేసవి రాత్రి వాన ఒక అందమైన కవితను కూడా వదిలి వెళ్లింది
వదిలి పెట్టేదేదో వెంట తీసుకుపోయేదేదో…🌧️🌳👌
మధురం.. తేమ లో నిశ్శబ్దం.. భలే ఉంది సార్.
ధన్యవాదాలు సార్!