భగవంతుడి గులాబితోట

How should a morsel digest without the sight of Him, without the view of His roses and rose-garden?

Rumi, Masnavi, 2: 3080

ఈసారి ఫాల్గుణమాసం
ఉపవాసదీక్ష పాటిస్తోంది
ఆకాశపు మీనారు లోంచి కోకిల
వేకువనే ప్రార్ధనకు పిలుస్తోంది.

భగవంతుణ్ణి తలుచుకోకుండా
రొట్టె తింటే అది తన గొంతుకి
అడ్డుపడుతుందనుకునేవాడెక్కడ
అనడిగాడు రూమీ.

ఆయన తోటల్లో విరబూసిన
గులాబీలు గుర్తురాకుండా
అన్నం సయించేదెట్లా
అని కూడా అన్నాడు.

నిన్న సాయంకాలం ఒక మిత్రుడు
ఈ రంజాన్ మాసపు సంధ్యవేళ
ఉపవాసదీక్ష ముగిస్తూ
నన్నూ తనతో విందుకి ఆహ్వానించేడు.

ఉపవసించడం ఒక ప్రార్థన
కాని ఉపవాస విరమణ
ఒక ధన్యవాద సమర్పణ
ప్రతి ఒక్క పారణ ఒక నివేదన.

అక్కడికి వెళ్ళాక తెలిసింది
అతడు భగవంతుడి పేరుమీద
తాను పిలిచిన ప్రతి ఒక్కరినీ
ఒక గులాబిమొక్కగా మార్చేసాడని.

(నిన్న సాయంకాలం ఖదీర్ బాబు ఇచ్చిన ఇప్తార్ విందు తలుచుకుంటూ)

28-3-2025

19 Replies to “భగవంతుడి గులాబితోట”

  1. My God… ఇక ఈ వసంతం అంతా అజా పిలుపుల్లో కోకిల వినపడకుండా ఉండదు…బ్యూటిఫుల్..బ్యూటిఫుల్…

    Happy happy happy birthday భద్రుడు గారూ…❤️

    With lots of love and respect..

  2. ఎంతో హృద్యంగా ఉంది. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సర్! వేలవేల సాహిత్య గులాబీలు పూయిస్తున్న మీకు ధన్యవాదాలు అభినందనలు 🙏

  3. చాలా బాగుంది సార్ !
    మొన్నటి ఇఫ్తార్ విందు లో మీరు పంచుకున్న మాటలను విందు తరువాత గుర్తు చేసుకున్నాము

    1. మీ కవిత్వం…, సాయంసంధ్య ఆకాశంఅంచులో చెక్కిన పసుపు నారింజ సంతకం ఇంకో మారు తిరిగి చూడకుండా వుండలేము..సర్.

  4. Happy birthday, and many happy returns of the day, sir!! 💐

    “ఉపవసించడం ఒక ప్రార్థన
    కాని ఉపవాస విరమణ
    ఒక ధన్యవాద సమర్పణ
    ప్రతి ఒక్క పారణ ఒక నివేదన.“
    🙏🏽🙏🏽🙏🏽

  5. Poetry personifies the human

    మీ కవిత్వం తో మేము శుభ్రపడుతున్నాము,
    మెరుగుపడుతున్నాము.

    ఉపవసించటం ఒక ప్రార్థన

    కాని ఉపవాస విరమణ
    ఒక ధన్యవాద సమర్పణ
    ఈ వాక్యము చాలు ఈశ్వరుడునీ తాకటానికి.
    పుట్టిన రోజు శుాకాంక్షలు సర్

  6. హృదయపూర్వక జన్మ దినోత్సవ శుభాకాంక్షలు sir 🙏🙏💐💐💐💐

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading