గాథాసప్తశతి తెలుగువాళ్ళ ఆస్తి. ప్రతి ఒక్క తెలుగు కవీ నేర్చుకోడానికి ఇష్టం చూపించాలేగాని, కవిత్వశిల్ప రహస్యాలు చెప్పడానికి గాథాసప్తశతి కవులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు.
ఆషాఢమేఘం-15
గాథాసప్తశతిలో కనిపించే స్త్రీపురుషప్రేమకీ తర్వాత రోజుల్లో కావ్యప్రపంచాన్ని పరిపాలించిన ప్రేమకీ మధ్య చాలా తేడా ఉంది. ప్రాకృత కవిత్వంలో కనిపించే ప్రేమ స్త్రీపురుషుల మధ్య సహజంగా వికసించే అత్యంత లౌకిక ప్రేమ, గ్రామీణ ప్రేమ. దేహాలనూ, మనసులనూ కలిపే ప్రేమ.
ఆషాఢమేఘం-14
ఒక విమర్శకుడు రాసినట్టుగా, 473 మంది సంగం కవులున్నారంటే, 384 మంది గాహాకోశ కవులున్నారంటే, ఆ కాలాలు, ఆ సమాజాలు ఎంత రసనిష్యందితాలయి ఉండాలి!
