దేవుడి సొంత దేశంలో

తుంచన్ పరంబు క్షేత్రంలో నడుస్తున్నంత సేపు నేను తెలుగు భాష గురించి, తెలుగుజాతి దైన్యం గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను. ఏమి? నాలుగున్నర ఎకరాలు తెలుగు నేలమీద ఒక కవి కోసం ఎక్కడా దొరకదా?

నిజ‘జ్యోతి’ర్దర్శనం

ఎన్నేళ్ళుగానో విన్న కవిత్వాలు, మనకి బాగా పరిచయమైన కథానాయికలు, నాయకులు, చిరపరిచితమైన లాండ్ స్కేప్-కాని ఉషాజ్యోతి బంధం కవిత్వంలో మనకి కనిపించినప్పుడు, మనం ఆ లోకాన్ని విస్మరించితిరుగుతున్నామనీ, ఒక క్షణం అన్నీ పక్కనపెట్టి, ఆ చెట్టుకింద, ఆ ఋతువులో, ఆ పాట వినడంద్వారా మనం మనకి మరింత చేరువకాగలమనీ అనిపిస్తుంది.

తల్లికోసం, తల్లిగురించి, తల్లివల్ల

ఆ తర్వాత మీరు మొత్తం ప్రపంచం తీసుకొచ్చి అతడి చేతుల్లో పెట్టండి, అత్యంత సౌకర్యవంతమైన జీవితాన్ని సమకూర్చిపెట్టండి, అహర్నిశలు కంటికి రెప్పలా కాపలా కాయండి. ఉహు. లాభం లేదు. కవి, అక్కడే, ఆ తన చిన్నప్పటి ఆ గాయం దగ్గరే కూచుండిపోతాడు.

Exit mobile version
%%footer%%