కాని శతాబ్దాల తరువాత కూడా ఒక జాజిపూల తెమ్మెరలాగా, నేలరాలినా పరిమళాన్ని వీడని పారిజాతంలాగా ఆమె పద్యం మనల్ని సమ్ముగ్ధం కావిస్తూనే ఉంది.
యుగయుగాల చీనా కవిత-14
చీనా కవిత్వ సంకలనాల్లో దాదాపుగా ఆ ముందుమాటనే ఉంటుంది తప్ప ఆ కవితలు కనిపించవు. ఆ ముందుమాట లోని భావోద్వేగం ముందు ఆ కవితలు మరుగన పడిపోయాయి. కాని ఆ పూలతెమ్మెర మధ్య, ఆ తేటనీటి ఎదట ఆ కవులు ఏమి సంభావించారో తెలుసుకోవాలని ఎవరికి అనిపించదు?
చరిత్రను కథగా రాయడానికి
ఎందుకంటే చరిత్రని మనం ఏదో ఒకటి 'తెలుసుకోడానికి' చదువుతాం. కాని చారిత్రిక సాహిత్యాన్ని ఏదో ఒకటి 'ఫీల్' చెందటానికి చదువుతాం.