చూస్తున్నంతసేపూ మనమీంచి ఆ జలపాతాలు ప్రవహించిపోతూనే ఉన్నాయి. ఆ సౌష్టవ భంగిమలు, ఆ అభినయ శుద్ధి, ఆ వాచికం, ఆ తాళధ్వని, జీవితాన్ని పరిశుభ్రపరిచి సుసంస్కృతం చేసి నీ ముందు స్వీకారయోగ్యంగా నిలబెట్టిన క్షణాలవి.
డొజెన్ కైగెన్
దేహాన్నీ, మనసునీ కూడా విదుల్చుకుంటేనే సాక్షాత్కారం సాధ్యమని అర్థమయింది. అసలు సాక్షాత్కారమనీ, సాధన అనీ రెండు వేరువేరుగా ఉండవనీ, సాధనమొదలుపెట్టడమే సాక్షాత్కారమని కూడా అర్థమయింది.
సదాశివరావు
ఆ సంగీతం వినిపిస్తున్నంతసేపూ ఆయన పూర్తిగా లీనమై నిశ్శబ్దంగా ఉన్నారు. కవులతోనూ, రచయితలతోనూ మాట్లాడేటప్పుడు చూపించే ఔద్ధత్యం ఆ రోజు ఏ కోశానా కనిపించలేదు. సంగీతం ఎదటా, చిత్రకారుల ఎదటా ఆయన ఒక శిశువులాగా ప్రవర్తించడం నేను చాలా సార్లు చూసేను.
