ఆధునిక విద్యలోని ఈ అమానుషత్వాన్నీ, హృదయరాహిత్యాన్నీ రూసో, టాల్ స్టాయి, థోరో, రస్కిన్ వంటి వారు పసిగట్టకపోలేదు. దాన్ని ప్రక్షాళన చేయడానికి అటువంటి వారు కొన్ని ప్రయోగాలు చేపట్టకపోలేదు. కానీ, వారందరికన్నా కూడా గాంధీజీ చేపట్టిన ప్రయోగాలు మరింత ప్రభావశీలమైనవీ, మరింత ఆచరణ సాధ్యమైనవీను
యాభై ఏళ్ళ ప్రయాణం
గాంధీజీ జీవిత విశేషాలను చూపించే ఒక చిత్రపట ప్రదర్శనని తానే స్వయంగా రూపొందించుకున్నాడు. గాంధీజీ వంశ వృక్షం నుంచి ఆయన అంతిమయాత్రదాకా, ఎన్నో అరుదైన ఫొటోలూ, వార్తాపత్రికలూ, స్టాంపులూ, చారిత్రిక పత్రాలూ సేకరించి గాంధీ జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించే ఒక ఫొటో ఎగ్జిబిషన్ నీ, అది చూపిస్తూ శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసే ఒక కథనాన్నీ తయారు చేసుకున్నాడు.
ఇరకం దీవి
ఇప్పుడు ఇరకం దీవి. కాని అడుగుతీసి ముందుకు పెట్టడమే అసాధ్యంగా ఉంది. నీళ్ళు ఒకటే తల్లకిందులవుతున్నాయి. 'గాలులు బలంగా ఉన్నాయి. పడవ నీళ్ళ మీద నడవడం కష్టం' అన్నాడు మా కోసం అక్కడ పర్యటన ఏర్పాట్లు చూస్తున్న సహోద్యోగి.
