ఆ మధ్య రాం దేవ్ బాబా ఆయన్ని 'ఆధునిక ఋషి' అన్నాడట. గురూజీని సదా అంటిపెట్టుకుని కంటికి రెప్పలా కాచుకునే ఆశీష్ ఆ మాట విని ఆయన్ని 'ఆధునిక ఋషి' అనికాదు 'సమకాలిక ఋషి' అని అనాలి అన్నాడట.
శాంతివనం: అనుభవాలు, ప్రయోగాలు
'అరుగులన్నిటిలోను ఏ అరుగు మేలు' అని అడిగితే 'పండితులు కూర్చుండు మా అరుగు మేలు' అన్నట్టు, పోరాటాలన్నిటిలోనూ, ఏ పోరాటం గొప్పదని అడిగితే, విద్యకి సంబంధించిన పోరాటాలూ, ప్రయత్నాలే సర్వోన్నతమైనవని నమ్ముతాను నేను.
సమగ్రంగా వికసించిన పాఠశాల
ఆ పసివయసులో చందమామ పత్రిక నాకేమి చెప్పిందంటే, ఆ ఇద్దరు చంద్రుళ్ళూ కూడా నిజమేనని. ఒకరికొకరు విరుద్ధం కారని. నవీన చంద్రుడు నా బుద్ధిని ఆకర్షిస్తాడు. పురాణ చంద్రుడు నా మనసుని దోచేసుకున్నాడు
