గెర్టార్ట్ హౌప్ట్ మన్ 'ద వీవర్స్' (1892) చదవడం పూర్తి చేసాను. ఈ రచన గురించి మొదటిసారి 'జర్మన్ సంప్రదాయ సాహిత్య దర్పణం' లో చదివాను. ముప్ఫై ఏళ్ళ కిందట. నాటకంలోంచి ఒక చిన్న భాగం అనువాదం కూడా ఉందందులో. మొత్తం నాటకం కోసం వెతికినప్పుడు గౌతమీ గ్రంథాలయంలో Sixteen European Plays దొరికింది, మోడర్న్ లైబ్రరీ వాళ్ళ ప్రచురణ.
టాల్ స్టాయి చివరి కథలు
టాల్ స్టాయి చివరి కథలు చదివాను. తెలుగులో 'విషాదసంగీతం' పేరిట రాదుగ వారు ప్రచురించిన తెలుగు అనువాదాల్లో చాలా గొప్ప కథలు- The Family Happiness (1859), The Kruetzer Sonata (1889), Father Sergius (1890-98) వంటివి వున్నాయి.
టాల్ స్టాయి జాబితా
మిమ్మల్ని ప్రభావితం చేసిన పుస్తకం ఏది? ఈ ప్రశ్న మనల్ని ఎవరో ఒకరు అడిగే ఉంటారు. కొంతమంది తాము చదివిన పుస్తకాల్లో ఫలానా పుస్తకం చదవడం వల్లనే తమ జీవితం గొప్ప మలుపు తిరిగిందని చెప్పగలుగుతారు. బుచ్చిబాబు రస్సెల్ పుస్తకాన్ని పేర్కొన్నట్టు.
