ఆ వేణువు నా చుట్టూ

ఈ సారి హైదరాబాద్ బుక్ ఫెయిర్లో నా కోసం కొత్త కవిత్వం తీసుకొచ్చాడు అనల్ప పబ్లికేషన్స్ బలరామ్. చైనా నుంచి గ్రీసుదాకా మూటగట్టుకొచ్చిన ఆ కవిత్వంలో, అన్నిటికన్నా ముందు నేను తెరిచిందీ, అక్కడే నిలిచిపోయిందీ రాబర్ట్ వాల్సర్ Thirty Poems (న్యూ డైరక్షన్స్, న్యూయార్క్, 2011).

కవితలు రాసుకునే బల్ల

యానిస్ రిట్సోస్ (1909-1990) ఇరవయ్యవ శతాబ్ది గ్రీకు కవుల్లోనే కాదు, ఐరోపీయ కవుల్లో కూడా ఎంతో ప్రసిద్ధి పొందిన కవి. శక్తిమంతమైన కవిత్వం రాసిన కవులు రాశిలో ఎక్కువ రాయకపోవడం మనకు తెలిసిందే. కాని రిట్సోస్ ఇందుకు మినహాయింపు.

పాట్రిక్ మోడియానో

ఈసారి అనల్ప ప్రచురణల బలరాం చేతిలో కవిత్వంతో పాటు నవలలు కూడా కనిపించాయి. ఏమిటని చూస్తే, పాట్రిక్ మోడియానో నవల So You Don't Get Lost in The Neighborhood. 2013 లో రాసిన నవల. 2014 లో ఆయనకు సాహిత్యానికి నోబెల్ బహుమతి లభించింది.