ప్రాచీన చీనాకవీంద్రుడు తావోచిన్ కవిత్వంలా, జెన్ సన్యాసులూ, స్వయంగా మహనీయులైన కవులూ అయిన హాన్ షాన్, సైగ్యో, బషోల మాటల్ని గుర్తు చేస్తున్న ఈ వాక్యాలు నాకెంతో దిగులు పుట్టిస్తున్నాయి. ఏమంటే ఇది నా కల కూడా.
అతిథిగృహం
రూమీ కవితని చూసి నాగేశ్వర్ కె.ఎన్.ఆర్ గారు బరంపురం నుంచి పరవశిస్తూ తనకి ఆ కవిత్వం ఇంకా ఇంకా కావాలనిపిస్తోందన్నారు. పులికొండ సుబ్బాచారిగారు గొప్ప సాహిత్యరసజ్ఞులు 'రూమీ గానం చేసాడని రాసారు, కాని మీ అనువాదం వచనంగానే ఉందికదా' అన్నారు.
పైకి ఇద్దరం, ఆత్మలో ఒక్కరం
'మీరు రూమీ గురించి తన్మయత్వంతో రాస్తున్నారని తెలుస్తోంది గాని,ఆ తన్మయత్వం ఎందుకో తెలియడం లేదు 'అన్నారొక మిత్రురాలు నిన్న నేను రూమీ గురించి రాసింది చదివి. 'రూమి అంటే మాకు తెలిసింది ఆయనొక ప్రేమకవి అని మాత్రమే' అని కూడా అన్నారామె.
