తెలుగు రాష్ట్రాల్లో గిరిజన, భాషా సాహిత్యాల మీద సాహిత్య అకాడెమీ విశాఖపట్టణంలో 26, 27 వ తేదీల్లో రెండు రోజుల సదస్సు నిర్వహించింది. ఒక భాషా ప్రాంతానికి చెందిన గిరిజనుల సాహిత్యం మీద ఒక సదస్సు నిర్వహించడం అకాడెమీ చరిత్రలోనే ఇది మొదటిసారి అని విన్నాను. ఆ సదస్సులో సమాపన ప్రసంగం చేసే గౌరవం నాకు లభించింది.
అరకులోయలో చెక్కుచెదరని శిఖరం
ప్రపంచ ఆదివాసి దినోత్సవం నాడు అరకులోయలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాక, నేను ఒకప్పుడు తిరిగిన దారుల్ని మళ్ళా వెతుక్కుంటూ హట్టగూడ, కరాయిగూడ గ్రామాలకు వెళ్ళాను. ఇరవయ్యేళ్ళ కిందట, ఇండియా టుడే పత్రికకోసం అరకులోయ మీద యాత్రాకథనం రాస్తూ ఆ గ్రామాలగురించి రాసాను.
గదబలపైన కృషి
రెండు వారాల కిందట, ఢిల్లీకి చెందిన 'జన కలెక్టివ్' అనే సంస్థకి చెందిన కళాకారుల బృందమొకటి నన్ను కలుసుకున్నారు. భారతప్రభుత్వం కోసం వాళ్ళు గదబల మీద ఒక డాక్యుమెంటరీ తీసే పనిలో ఉన్నారు. ఆ జాతి గురించీ, వాళ్ళ సంస్కృతి గురించీ ఏదన్నా చెప్పగలనేమోనని నన్ను వెతుక్కుంటూ వచ్చారు.
