ఇరవయ్యవ శతాబ్దిలో భారతీయ కళాకారులు కేవలం కళకి సంబంధించిన ప్రశ్నలేకాక, దర్శనానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదుర్కొన్నారు. అసలు వారి దార్శనిక సమస్యలే వారి కళాభివ్యక్తిని నిర్దేశించాయని కూడా చెప్పవచ్చు. కవులైనా, చిత్రకారులైనా, సంగీతకారులైనా, సాధకులందరీ సమస్యా ఇదే.
స్త్రీమూర్తుల వదనాలు
సత్య శ్రీనివాస్ చాలా సున్నితమైన భావుకుడు, కవి, చిత్రకారుడు, ప్రకృతి ఉపాసకుడు, క్రియాశీల కార్యకర్త- ఒక్కమాటలో చెప్పాలంటే, తపస్వి. అట్లాంటివాళ్ళు ఎక్కడ సంచరిస్తుంటే అక్కడ దీపం కాంతి ప్రసరిస్తూ ఉంటుంది. ఈ సారి అట్లాంటి కాంతి కొందరు తల్లులమీద పడింది, మహనీయులైన స్త్రీమూర్తులు, తల్లులు,అత్తలు, అమ్మమ్మలు, నాయనమ్మలు.
వాన్ గో, గురజాడా
పదిరోజుల కిందట గణేశ్వర రావు గారు వాన్ గో చిత్రించిన 'పొద్దుతిరుగుడు పూలు' చిత్రాన్ని పరిచయం చేసినప్పుడు, ఒక మిత్రుడు, ఆ చిత్రంలో ప్రపంచ ప్రసిద్ధి చెందేటంత ప్రత్యేకత ఏమున్నదో తెలియడం లేదని రాసాడు. ఆ మాటలకి స్పందించి అక్కడే రెండు వాక్యాలు రాయాలనుకున్నాను, కానీ, నా ఆలోచనలు మరింత వివరంగా రాయాలనిపించింది.
