బ్రిటిష్ చిత్రకారుడు ట్రెవర్ ఛాంబర్లేను నా రోల్ మోడల్స్ లో ఒకరని చెప్పాక, ఆయన గురించి మరొక నాలుగు వాక్యాలు కూడా రాయాలనిపించింది. ఛాంబర్లేను 1934 లో పుట్టాడు. చిన్నప్పణ్ణుంచీ చిత్రకళ మీద ఆసక్తి ఉన్నప్పటికీ, ఎవరిదగ్గరా చిత్రకళ నేర్చుకోలేదు. స్వయంకృషితోటీ, పూర్వ బ్రిటిష్ చిత్రకారుల్ని అధ్యయనం చెయ్యడంతోటీ తనంటన తను చిత్రకారుడిగా మారేడు.
మార్క్ ఫోలీ
ఇప్పుడు నీటిరంగుల్తో ప్రయోగాలు చేస్తున్న వాళ్ళల్లో అగ్రగణ్యుడైన ఫ్రెంచి చిత్రకారుడు మొరెల్లిని నేను అభిమానిస్తున్నానని చెప్పానుకదా, మరి మొరెల్లి అభిమానిస్తున్న చిత్రకారులెవరు? అతడు అమెరికన్ గ్రాఫిక్ డిజైనర్ మిల్టన్ గ్లాసర్ నుంచి స్ఫూర్తి పొందానని చెప్పుకున్నాడు. కాని ఇటీవలి కాలంలో అతడు పదే పదే మాట్లాడుతున్న చిత్రకారుడు తన కన్నా ఇరవయ్యేళ్ళు చిన్నవాడైన మార్క్ ఫోలీ.
చిత్రలేఖన పద్ధతుల గురించి
తెలుగులో చిత్రకళా ప్రశంస (అప్రిషియేషన్ అనే పదానికి సరైన తెలుగు పదం నాకింతదాకా దొరకలేదు) చాలా తక్కువ. ఆ మాటకొస్తే ఒక కవితనీ, కథనీ ఎట్లా చదవాలో కూడా నేర్పే కోర్సులేవీ మనకి లేవు. సంగీతం విషయం చెప్పనక్కర్లేదు. ఏదైనా ఒక సంగీత కచేరీమీద పత్రికల్లో వచ్చే సమీక్షలు చదివితే సంగీత ప్రశంసకు తగిన పదబంధాలు మనకింకా దొరకనేలేదని తెలుస్తుంది.
