ఒక సాధన కథ

ఆయన్ని కలిసి మాట్లాడుతున్నప్పుడూ, ఆ పుస్తకం చదువుతున్నప్పుడూ కూడా నా మనసులో వియత్నమీస్ బౌద్ధ సాధువు థిచ్ నాట్ హన్ నే మెదులుతూ ఉన్నాడు. మోక్షానంద కూడా థిచ్ నాట్ హన్ లానే కవి. ఆయన ప్రయాణం కూడా భావకవిత్వం నుంచి బౌద్ధ కవిత్వం దాకా నడిచిన అన్వేషణ. ఆయన భావుకత్వం తామరపూలు పూసిన కొలనులాంటిది. ఆ వాక్కు శుభ్రవాక్కు. అందులో శుభ్రత, స్వచ్ఛతలతో పాటు, ఒక సౌందర్యపు మిలమిల కూడా ఉంది.