ఉద్యోగంలో భాగంగా ఆ ప్రాంతాలన్నీ తిరుగుతున్నప్పుడు ఆ అడవుల్నీ, కొండల్నీ అట్లా విభ్రాంతితో కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయేవాడిని.
పునర్యానం-5
తాను చూసిన పరమ సత్యాన్ని ప్రకటించడానికి కబీరు చేట వైపు, తిరగలి వైపు, సంతవైపు, సంతలో కత్తులు బేరమాడే వాళ్ళ వైపు చూసినట్టే నేను కూడా నాకు అనుభవానికి వస్తున్న సత్యాన్ని గుర్తుపట్టడానికి ఆ చిన్నప్పటి అచ్చుల్నే ఆశ్రయించాను.
పునర్యానం-3
కాని గమనించవలసిందేమంటే ఎక్కడ మనిషి తన చైతన్యానికి ఆధారభూమికగా స్థూల సత్యాన్ని మాత్రమే గ్రహిస్తాడో అది అన్నమయకోశమని. అంటే అది లేకుండా తక్కిన భూమికలు, తక్కిన చైతన్యతలాలు లేవు, కాని అదొక్కటే చైతన్యం కాదు.
