చిత్రలేఖనం, వర్ణలేపనం

మనం చిత్రలేఖనం అని వ్యవహరించే కళలో నిజానికి రెండు విద్యలున్నాయి, డ్రాయింగూ, పెయింటింగూను. బొమ్మలు గియ్యడం,రంగులు వెయ్యడం.  ప్రాచీన చీనా చిత్రకారులూ, భారతీయ, పారశీక మీనియేచర్ చిత్రకారులూ ప్రధానంగా రేఖా చిత్రకారులు. యూరోప్ లో కూడా తొలితరం చిత్రకారులు రేఖాచిత్రకారులే. దాదాపుగా క్లాసిసిజం కాలం దాకా కూడా అంటే పందొమ్మిదో శతాబ్ది మొదటిరోజులదాకా కూడా రేఖకే ప్రాధాన్యం