ఇంకా తెల్లవారకుండానే కొలిమి రగిలిస్తుంది కోకిల తన గొంతు ఒక తిత్తిగా ఆ ఊదడానికి అంతే ఉండదు.
పునర్యానం-55
నిజంగా అలాంటి వ్రతం ఒకటి మనం పాటించగలిగితే! నెలరోజులు కాదు, కనీసం ఇరవైనాలుగ్గంటల పాటు! పరుషవాక్కు లేని ప్రపంచంలో నెలకు నాలుగు వానలు తప్పకుండా పడతాయన్న నమ్మకమైతే నాకుంది. ఆ నమ్మకానికి చేరుకున్నాక రాసిందే ఈ కవిత.
పునర్యానం-32
కాని ఆధునిక యుగం పతనావస్థకు చేరుకున్న కాలంలో నేనున్నాను. ఇది ఉత్సవసందర్భం కాదు, ఉద్రేకప్రకటనా నడవదు. ఇప్పుడు పలికేది ఒక ఆక్రందన, గుండెలు బాదుకోడం మాత్రమే. దానికి ఎక్కడ? ఏ కవిత్వం నుంచి నేను స్ఫూర్తి పొందగలనని ఆలోచించాను.
