ఋతుపవనమేఘాలు తమ నేలల్ని తాకినప్పుడు పూర్వకాల సంగం కవులు, గాథాసప్తశతి, వజ్జాలగ్గం కవులు సంతోషంతో పులకించిన పలవరింతల్ని కాళిదాసు మేఘసందేశంగా తీర్చిదిద్ది భారతీయ ఋతుపవనాన్ని ఒక అజరామర కావ్యంగా మార్చేసాడు.
రంగులవంతెన
మేఘావృతమైన ఆకాశం. నా హృదయమింకా మేఘసందేశ కావ్యం చుట్టూతానే పరిభ్రమిస్తున్నది. ఆ కావ్యం మనమీద జల్లే మంత్రమయసుగంధం ఒకపట్టాన వదిలేది కాదు. టాగోర్ నే చూడండి. ఆయన జీవితమంతా ఆ కావ్యాన్ని స్మరిస్తూనే వున్నాడు. ఎంతగా అంటే, తనను తాను 'ఆలస్యంగా, ప్రింటింగ్ ప్రెస్ యుగంలో జన్మించిన కాళిదాసుగా' చెప్పుకునేటంతలా.
స్వాగతం మేఘమా!
ఎన్నేళ్ళయింది మృగశిర కార్తె అడుగుపెట్టిన రోజునే తొలకరి జల్లు పలకరించి! జల్లు కూడా కాదు, సముద్రమే ఆకాశం మీంచి ప్రయాణిస్తున్నట్టుంది! ఋతుపవనమేఘమిట్లా అడుగుపెట్టవలసిననాడే అడుగుపెట్టడం కన్నా భారతీయ ఆకాశానికీ, భారతీయ సుక్షేత్రానికీ శుభవార్త మరేముంటుంది! అంతకన్నా సత్యం, శివం, సౌందర్యమేముంటుది!
