మెడిటేషన్స్-5

ఎప్పుడు ఏ అత్యవసర చికిత్స చెయ్యవలసి వస్తుందో అని సర్జను తన పరికరాల్ని సిద్ధంగా పెట్టుకున్నట్టు మనం దైవత్వాన్ని గుర్తుపట్టడానికి సదా సంసిద్ధంగా ఉండాలట. ఆ అనుబంధాన్ని గుర్తుతెచ్చే చిన్నపాటి అవకాశాన్ని కూడా వదులుకోకూడట.

మెడిటేషన్స్-4

జీవితంలో మనిషికి లభించగల గొప్ప అనుగ్రహం తను నిర్మలుడని తెలుసుకోవడం. తన నిర్మలత్వాన్ని కాపాడుకోవడం తన చేతుల్లోనే ఉందని తెలుసుకోవడం. ఒకసారి ఆ ఎరుక కలిగిన తర్వాత, ఆ పనిచెయ్యకుండా ఉండటం కన్నా దురదృష్టం మరొకటి ఉండబోదు

మెడిటేషన్స్-3

మనుషులూ దేవతలూ కలిసి నిర్మిస్తే తప్ప ఒక మనిషి మనిషిగా రూపొందలేడని గుర్తుపట్టాడు ఆయన, అందుకనే తన గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనుషులకీ, దేవతలకీ కృతజ్ఞతా సమర్పణగా రాసుకున్నాడు.

Exit mobile version
%%footer%%