కొత్త సంవత్సరం శుభాకాంక్షల్తో ఈ రోజు నుంచీ Marcus Aurelius (121-180) రాసిన Meditations పైన ప్రసంగాలు మొదలుపెట్టాను. ఆ ప్రసంగం ఇక్కడ వినవచ్చు.
మన కాలపు మార్కస్ అరీలియస్
ఎందుకంటే, స్టోయిక్కులు చెప్పినట్లుగా ప్రపంచాన్ని మార్చడం మనచేతుల్లో లేని పని. కాని ప్రపంచం పట్ల మన స్పందనలూ, ప్రతి స్పందనలూ మాత్రం మన చేతుల్లో ఉన్నవే. వాటిని మనం అదుపుచేసుకోగలిగితే, మనం ఈ ప్రపంచాన్ని ఏ విధంగా సమీపించాలో ఆ విధంగా సమీపించగలిగితే, తప్పకుండా మనమున్న మేరకు ప్రపంచం మారడం మొదలుపెడుతుంది. విమర్శ, ఖండన, ద్వేషం, దూషణ చెయ్యలేని పని మన జీవితమే ఒక ఉదాహరణగా మనం చెయ్యగలుగుతాం.
నీ శిల్పివి నువ్వే
అరీలియస్ ఎటువంటి సాత్త్వికజీవితం గురించి మాట్లాడేడో అటువంటి జీవితం జీవిస్తున్నవాళ్ళు నా సమకాలికుల్లో జయతి, లోహి. వారికి ఈ పుస్తకం కానుక చేస్తున్నాను.
