ఉన్న సత్యం ఒక్కటే. అది మానవుడి మర్త్యత్వం. జీవితం అశాశత్వం. అలాగని అర్థరహితం కాదు. జీవించక తప్పదు. కాని జీవించవలసిన ఆ జీవితాన్ని మరింత క్రమశిక్షణతో, అతి తక్కువ క్లేశంతో గడపడం ఎలా అన్నదే వాటి లక్ష్యం.
ఈ ప్రపంచం మంచికే
నేనన్నాను: 'ఎందుకు కాదు? నేనొక నది ఒడ్డున నిల్చున్నాను. కొన్ని క్షణాల ప్రశాంతి పొందాను. దాన్నిప్పుడిలా నలుగురితో పంచుకోలేదా!' అని.
నువ్వెప్పటికీ స్వతంత్రుడివే.
వినయంగా మసలుకోడానికీ, ఇతరులకు సేవచేయడానికీ, భగవంతుణ్ణి అనుసరించడానికీ నువ్వెప్పటికీ స్వతంత్రుడివే.
