మహాప్రస్థానం

మహాప్రస్థానాన్ని ఒక యువకుడికో, భిక్షుకుడికో, deathbed present గానో పంపండి అని రాసాడు చెలంగారు. కాని అది ఒక పెళ్ళికానుకగా బహూకరించదగ్గ పుస్తకం కూడా అని అర్థమయింది ఆ రోజు.

మోహనరాగం: మహాప్రస్థానం

'నా అకాశాలను లోకానికి చేరువగా, నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా' తన కవితను అర్పిస్తానన్నాడు శ్రీశ్రీ. మహాప్రస్థానంలో ఆ ఆశయాల సాఫల్యం ఏ మేరకు సిద్ధించిందో వివరిస్తున్నారు వాడ్రేవు చినవీరభద్రుడు 'మోహనరాగం' పేరిట 2007 లో చేసిన ప్రసంగంలో.