కాళీ పదములు

ఈమె జీవితంలో ఏ ఉత్పాతాల్ని, ఏ సంక్షోభాల్ని, ఏ వైక్లబ్యాల్ని ఎదుర్కొన్నదోగాని హృదయాన్ని గొంతుగా మార్చి తల్లిని పిలిచింది. ఆమె తల్లినెట్లా ఆవాహన చేసిందో ‘ఆవాహన’ కవితలో ప్రతి ఒక్క వాక్యం ఒక ప్రకంపనగా సాక్ష్యమిస్తుంది. వట్టి ఆవాహనా, వట్టి పిలుపూ, వట్టి ఆరాటమే కాదు, ఆమెని తల్లి ఎట్లా కరుణించిందో కూడా ఈ కవిత్వం మనకి ఆనవాలు పట్టిస్తున్నది.