కోణార్క సూర్యదేవాలయం ఫొటోలు చూసి మిత్రులు కోణార్క గురించి రాయమని అడిగారు. ముప్పై ఏళ్ళ కిందట మాయాధర్ మానసింగ్ రాసిన 'కోణార్క' కవిత చదివినప్పణ్ణుంచీ కోణార్క చూడాలన్న కోరిక రెండేళ్ళ కిందట తీరింది. కాని ఇప్పుడు నేను ఆ కోణార్క గురించి కాక, భువనేశ్వర్ లోని మరొక కోణార్క ని పరిచయం చేయబోతున్నాను.