జీలకర్రగూడెం

ఆ ఉపాసిక ఎవరు? ఎందుకామె బుద్ధుడి చరణాల్ని ఆశ్రయించింది? ఆమె నర్తకినా, గణికనా, విదుషినా? ఎవరై ఉంటుంది? ఆమె చైత్య గృహానికి మెట్లు కట్టించాలని ఎందుకనుకుంది? అప్పుడే, అంటే థేరయానం ఇంకా మహాయానానికి తావు ఇవ్వకముందే ఒక స్త్రీ బౌద్ధ సంఘంలో ఎలా ప్రవేశించింది?