జయంత్ మహాపాత్ర

జయంత్ మహాపాత్ర అంతర్జాతీయస్థాయి గుర్తింపు పొందిన కవి. సాధారణంగా ఆధునిక సమకాలీన ప్రపంచ కవిత్వసంకలనాల్లో భారతదేశానికి ప్రతినిధిగా ఎంచబడే ఒకరిద్దరు కవుల్లో ఆయన కూడా ఉంటున్నాడు. 85 సంవత్సరాల ఈ కవి తన ముఫ్ఫైఎనిమిదో ఏట కవిత్వరచన మొదలుపెట్టాడు.