మోహనరాగం: హైకూ

హైకూ అంటే చంద్రుణ్ణి చూపించే వేలు అని ఇస్మాయిల్ ఎందుకన్నారు? హైకూ ప్రక్రియగురించి ఉదాహరణల్తో వివరిస్తూ 'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగం.

ఇక్కడున్నది ఇస్సా

ప్రతి భాషలోనూ కవులకొక వంశావళి ఉంటుంది. అది రక్తసంబంధమ్మీద ఏర్పడే అనుబంధంకాదు, అక్షరసంబంధం. ప్రతి కవీ తనముందొక పూర్వకవిని ఆశయంగా పెట్టుకుంటాడు. అతడి స్థాయికి తనూ చేరాలని తపన పడతాడు, 'మందః కవి యశః ప్రార్థీ' అని కాళిదాసు అనుకున్నట్టు. త

పసుపుపచ్చటిదుమ్ము

సంవత్సరమంతటిలోనూ అత్యంత సుందరభరితమైన కాలమేదంటే, ఫాల్గుణమాసంలో కృష్ణపక్షం రెండువారాలూ అంటాను. వసంత ఋతువు అడుగుపెట్టే ముందు ఆమె మువ్వల చప్పుడులాగా ఈ రోజులంతా గొప్ప సంతోషంతోనూ, అసదృశమైన శోభతోనూ సాక్షాత్కరిస్తాయి.